ETV Bharat / state

ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద ఉద్ధృతి

ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణానది వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో అనేక గ్రామాల్లోని ఇళ్లు నీట మునిగాయి. కొక్కిలిగడ్డ హరిజనవాడలోని 278 పైగా ఇళ్లలోకి వరద నీరు చేరింది. దక్షిణ చిరువోలులంకలో భారీ స్థాయిలో వరద నీరు చేరుతోంది. వరద ప్రవాహాం పెరుగుతున్న నేపథ్యంలో విపత్తు నిర్వహక శాఖ అధికారులను, సహాయక బృందాలను అప్రమత్తం చేసింది.

ప్రకాశం బ్యారేజీ
author img

By

Published : Aug 17, 2019, 8:11 AM IST

Updated : Aug 17, 2019, 8:41 AM IST

ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద ఉద్ధృతి

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ వరద ఉద్ధృతి పెరగుతోంది. సుమారు 8 లక్షల 21 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు. అధికారులను, సహాయక బృందాలను విపత్తు నిర్వహాకశాఖ సిద్ధంగా ఉంచింది. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. వరద నీటిలో ఎవరూ ఈతకు, స్నానాలకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు. వరద ప్రవాహంలో బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లుతో నదిలో ప్రయాణించవద్దంటూ అప్రమత్తం చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

పులిచింతల వద్ద ఉద్ధృతంగా కృష్ణా ప్రవాహం
పులిచింతల జలాశయం వద్ద కృష్ణా నది వరద ప్రవాహం ఉద్ధృతంగా మారింది. సుమారు 7లక్షల 77 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 7లక్షల 53 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 22 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా.. ప్రస్తుతం 168.93 అడుగులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 38.68 టీఎంసీలు నిల్వఉంది.

మోపిదేవి మండలంలో నీట మునిగిన ఇళ్లు

కృష్ణానదిలో పెరుగుతున్న వరద కారణంగా మోపిదేవి మండలంలో ఇళ్లు నీట మునిగాయి. కొక్కిలిగడ్డ హరిజన వాడలో 278 ఇళ్లలోకి వరద నీరు చేరింది. బొబ్బర్లంకలోనూ ఇళ్లు నీటిలో మునిగాయి. స్థానికులు పునరావాస కేంద్రాలకు వెళ్లకుండా అక్కడే ఉంటున్నారు. ఎడ్లలంక గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. పులిగడ్డ శివారులోని పల్లెపాలెం, రేగుల్లంకలోనూ ఇళ్లు జలదిగ్బంధం అయ్యాయి. దక్షిణ చిరువోలులంకలో భారీ స్థాయిలో వరద నీరు చేరుతోంది.

ఇది కూడా చదవండి.

మహోద్ధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ... ముంపులోనే గ్రామాలు

Intro:Ap__tpt_82_16_ganjayi_swadeenam_av_ap10009

చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లానురు వద్ద నిల్వ చేసిన 48కిలోల గంజాయి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇవ్వాళ గంజాయి నిల్వలపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి ఇద్దర్ని అరెస్ట్ చేసీ గంజాయి బస్తాలు ను స్వాధీనం చేసుకున్నారు Body:KipConclusion:Hgf
Last Updated : Aug 17, 2019, 8:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.