విజయవాడ ఇంద్రకీలాద్రీపై వెలసీన జగన్మాత కనకదుర్గమ్మకు భక్తులు ఆషాఢమాసం సందర్భంగా సారెలు సమర్పిస్తున్నారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా సెక్యూరిటి సిబ్బంది కనకదుర్గమ్మకు పసుపు, కుంకుమ, గాజులు, సారెను సమర్పించారు.
కరోనాతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని అమ్మవారిని వేడుకున్నారు. పరిమిత సంఖ్యలో... కొవిడ్ నింబంధనలు పాటిస్తూ ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. ఆషాఢం సారె సమర్పించేందుకు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్న వారికి టైంస్లాట్ ప్రతిపాదికన అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. అంతరాలయ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేసిన దేవస్థానం అధికారులు... ముఖమండపం వద్ద నుంచే అమ్మవారిని దర్శించుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి