మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేయడాన్ని కృష్ణా జిల్లా తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వంలో మంత్రులు మాట్లాడే భాషను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు యత్నించిన దేవినేనిని... అప్రజాస్వామికముగా అరెస్ట్ చేశారని విమర్శించారు. ప్రజల సమస్యలపై నిలదీసిన వారిపై కేసులు పెట్టి.. హింసించారని దుయ్యబట్టారు.
ఫ్యాక్షన్ భావజాలం ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో రాజరికపాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంత నీచమైన భాషను మాట్లాడే మంత్రులను ఎన్నడూ చూడలేదన్నారు. తెలుగుదేశం క్రమశిక్షణ కలిగిన పార్టీ అని అన్నారు. కొడాలి నానిని గెలిపించిందుకు గుడివాడ ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా ఆయన ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: