ETV Bharat / state

'ఆర్టీసీ ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలి' - కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు

ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సూచించారు. మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్​ను సందర్శించి అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు.

krishna district sp ravindranath babu visit machilipatnam bus stand
మచిలీపట్నం బస్టాండ్​ను సందర్శించిన జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు
author img

By

Published : May 21, 2020, 3:31 PM IST

బస్సులు ఎక్కే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్.. ఆర్టీసీ అధికారులకు సూచించారు. లాక్ డౌన్‌ అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బస్సులు నడుపుతున్న నేపథ్యంలో మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్​ను సందర్శించారు. ప్రయాణం చేసేవారు మాస్కులు ధరించేలా, శానిటైజర్​తో చేతులు శుభ్రపరుచుకునేలా చూడాలని సిబ్బందికి సూచించారు.

విధుల్లో ఉన్న వారికి మాస్కులు, గ్లౌజులు అందజేశారు. పోలీస్ శాఖ తరఫునుంచి ఎలాంటి సహాయం అవసరమైనా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రయాణికులు తమ చేతులు శుభ్రపరచుకునేందుకు వీలుగా ఫూట్ ఆపరేట్ శానిటైజర్ ఎక్విప్​మెంట్ మెషీన్​ను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజరు.. ఎస్పీకి తెలిపారు.

ఇవీ చదవండి:

ఆ గ్రామాలకు వచ్చి మాట్లాడండి: అయ్యన్న

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.