పలు కేసులలో ముద్దాయిలుగా ఉన్న ఇద్దరు నిందితులను కృష్ణా జిల్లా పెదపారుపూడి పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన దుర్గాప్రసాద్‌పై 28 కేసులు నమోదు కాగా... నగరం నుంచి పోలీసులు బహిష్కరించారు. మరో నిందితుడు శేఖర్‌పై రెండు కేసులు ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న క్రమంలో వీరిని పట్టకున్నామని గుడివాడ డీఎస్పీ సత్యానందం తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.13వేలు, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: మైనర్ అపహరణ కేసుపై... పోలీసులు దర్యాప్తు ముమ్మరం