కృష్ణా జిల్లాలో కరోనా చికిత్స అందిస్తున్న పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జేసీ శివశంకర్ తనిఖీలు చేపట్టారు. గత రెండు రోజుల్లో నిబంధనలు పాటించని 35 ఆస్పత్రులపై రూ.2.86 కోట్లు జరిమానా విధించారు. కరోనా చికిత్స కోసం అందించే ఆరోగ్య సేవల్లో 50 శాతం ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ కలిగిన వారికి చికిత్స అందించాలని జేసీ సూచించారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 52 ఆస్పత్రులపై రూ.3.61 కోట్లు జరిమానా విధించినట్లు జేసీ శివశంకర్ వెల్లడించారు. కొవిడ్ చికిత్సకు వసూలు చేస్తున్న ఫీజుపై నోడల్ అధికారులు, ఆస్పత్రి పర్యవేక్షకులు బాధ్యత వహించాలని ఆదేశించారు. రోగులు చెల్లించిన నగదుకు బిల్లులు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం మార్గదర్శకాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు.
ఇదీచదవండి.