కృష్ణా జిల్లాలోనే అతిపెద్ద క్వారంటైన్ కేంద్రమైన గన్నవరం పశు వైద్య కళాశాలలో.. 54 రోజులుగా 3 విభాగాల్లో క్లస్టర్ సచివాలయ ఏఎన్ఎమ్లు సేవలందిస్తున్నారు. క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేసిన దగ్గర్నుంచి 24 మంది నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు.
వరుసగా 15 రోజులు విధులు నిర్వహిస్తే సెలవులు ఇస్తామని అధికారులు చెప్పారన్నారు. ఇంతవరకూ తమకు సెలవులు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కుటుంబ సభ్యులతో గడిపే సమయం దొరకడం లేదని... ఇప్పటికైనా తమకు ఆ అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: