విజయవాడ మొగల్రాజపురంలో ఇటీవల కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. కొండచరియలను తొలగించే అంశంపై ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. కొండచరియలు విరిగిన ఘటనలో గృహాలు దెబ్బతిన్న బాధితులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరికొన్ని కొండచరియలు విరిగిపడే అవకాశముందని.. స్థానికులు అంగీకరిస్తే మరో ప్రాంతంలో ఇళ్లు కేటాయిస్తామని కలెక్టర్ చెప్పారు. తాము ఇక్కడే ఉంటామని... కొండ పైభాగాన్ని తొలగించాలని స్థానికులు కోరారు.
ఇదీ చదవండి: 'పల్లె ప్రగతికి పంచ సూత్రాలు'... తెదేపా మేనిఫెస్టో విడుదల