రాష్ట్రంలో భూముల రీ-సర్వేకు సంబంధించిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకానికి ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 21న శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో.. కార్యాచరణ వేగవంతం చేశామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ప్రయోగాత్మకంగా కార్స్ సాంకేతికతతో నిర్వహించిన భూముల రీ-సర్వేను ఆయన పరిశీలించారు. అనంతరం జగ్గయ్యపేట మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
రీ-సర్వే కొలతలపై అభ్యంతరాలు స్వీకరించామని, గ్రామంలో 190 భూములకు సంబంధించిన అర్జీలు రాగా.. 155 పరిష్కారమయ్యాయని కలెక్టర్ వెల్లడించారు. మిగిలిన 35 అర్జీలను పరిష్కరించి పట్టాలు సిద్ధం చేస్తామన్నారు. మరోవైపు వేదాద్రి ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూసేకరణ వేగవంతం చేస్తున్నామని వివరించారు. జేసీ మాధవిలత, సబ్ కలెక్టర్ ధ్యాన్చంద్ర సహా ఆయా శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి