ETV Bharat / state

మోడల్ పీఎస్ ను ప్రారంభించనున్న హోం మంత్రి

కోటి 40లక్షల వ్యయంతో అవనిగడ్డలో నిర్మించిన ఆదర్శ పోలీస్ స్టేషన్ ను హోం మంత్రి సుచరిత ఇవాళ ప్రారంభించనున్నారు.

మోడల్ పీఎస్ ను ప్రారంభించనున్న హోం మంత్రి
author img

By

Published : Aug 9, 2019, 7:25 AM IST

కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆదర్శ పోలీస్‌స్టేషన్​ను హోం మంత్రి సుచరిత ప్రారంభించనున్నారు. కోటి 40 లక్షలతో పీఎస్ ను నిర్మించారు. 11 గం.కు నిర్వహించే ఈ ప్రారంభోత్సవంలో డీజీపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆదర్శ పోలీస్‌స్టేషన్​ను హోం మంత్రి సుచరిత ప్రారంభించనున్నారు. కోటి 40 లక్షలతో పీఎస్ ను నిర్మించారు. 11 గం.కు నిర్వహించే ఈ ప్రారంభోత్సవంలో డీజీపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

ఇవీ చూడండి-ఆయన సంకల్పం... పర్యావరణహితం

Intro:పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో పర్యాటక కేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు.


Body:ap_tpt_36_30_vesavi_selavulu_pkg_c5

పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో సరదాగా గడపడానికి పర్యాటక కేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు. పిల్లలు చదువుల నుండి ,పెద్దలు పని ఒత్తిడినుండి ఉపశమనం పొందడానికి మంచి ప్రశాంతమైన ప్రదేశాలు వైపు వెళుతున్నారు. అలాంటి వాటిలో చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం మండలంలోని తలకోన ఒకటి. విస్తారంగా విస్తరించి ఉన్న శేషాచల అడవుల్లో మధ్యలో ఉన్న జలపాతం దీని యొక్క ప్రత్యేకత .ఎంతటి ఎండాకాలమైనా నా ఇక్కడి జలపాతంలో నీరు ఉండడం ఒక విశేషం. అరుదైన వృక్ష జాతులు మధ్య ఈ జలపాతం పారూతుండడం భారీ వృక్షసంపద, కొండచరిలు, రకరకాల జంతువుల అరుపుల మధ్య ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది. తలకోనలో సహజసిద్ధంగా వేలిసిన శ్రీ సిద్దేశ్వర స్వామి శివాలయం ఉండడం పెద్దలకు ఆధ్యాత్మికంగా, పిల్లలకు ఆటవిడుపు కేంద్రంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎంతటి ఎండాకాలం అయినా ఈ తలకోనలో ఎండ తీవ్రత తెలియదని, దానికితోడు ప్రకృతిని ఆస్వాదించడానికి ఈ ప్రదేశం ఎంతో బాగుంటుందని పర్యాటకులు ఆనందిస్తున్నారు. జల, జల పారే సెలయేరులకు అతి పెద్ద భారీ వృక్షాలకు పెట్టింది పేరు ఈ తలకోన. ప్రశాంత వాతావరణంలో పక్షులు కిలకిలా రాగాల నడుమ అడవి జంతువుల వీక్షణలో మరపురాని వేసవి విడిదిగా ఈ ప్రాంతం ఉంటుందని పర్యాటకులు అంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఒక్కసారి ఈ ప్రదేశానికి వస్తే మళ్లీ మళ్లీ రావాలని పించే విధంగా పర్యాటకులను ఈ ప్రాంతం ఆకట్టుకుంటుంది. ఇక్కడకు వచ్చేటటువంటి పర్యాటకులకు అన్ని సౌకర్యాలు సమకూర్చినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. వచ్చిన యాత్రికులకు వసతి సౌకర్యం తో పాటు భోజన వసతి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతం పెద్దలకు ఆధ్యాత్మికంగానూ ఇటు పిల్లలకు ఆటవిడుపుగా ఉండటంతో పర్యాటకులు తలకోనకు పోటెత్తుతున్నారు.


Conclusion:పి.రవి కిషోర్ ,చంద్రగిరి.9985555813.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.