ETV Bharat / state

పుల్ల విరిచి చేతిలో పెట్టారంటే.. అంతే! - కృష్ణా జిల్లా

అరే... ఈ పుల్లవిరుపు మాటలు వద్దు. ఏదైనా సుత్తి లేకుండా నేరుగా చెప్పు... ఎవరైనా అంటూ ఉంటే తరచూ వింటూ ఉంటాం. ఆ ఊరిలో మాత్రం దీనికి భిన్నం. పుల్లవిరిచారంటే సూటిగా చెప్పేసినట్టే. ఇంతకీ ఆ ఊరేంటి.... ఈ పుల్లవిరుపు పంచాయితీ ఏంటో చూడండి.

తిరువూరులో వింత ఆచారం
author img

By

Published : Mar 27, 2019, 7:08 PM IST

Updated : Mar 28, 2019, 9:17 AM IST

తిరువూరులో వింత ఆచారం
పుల్లవిరుపు మాట కోసం నాయకుల పరుగులు...

ఆ ఊళ్లో అందరిదీ ఒకే మాట, ఒకే ఓటు. ఆ గ్రామపెద్ద ఒక్కసారి చిన్నపుల్లవిరిచి చేతిలో పెట్టారంటే చాలు పని అయిపోయినట్టే. ఎన్నికలు వచ్చాయంటే చాలు గ్రామ పెద్ద వెంటపడతారు. ఊరికికావాల్సిన పనులు చేసి పెడతామని పడిగాపులు కాస్తారు. ఒక్క ఎన్నికల విషయంలోనే కాదు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పుల్లవిరిచి చెప్పాల్సిందే.

తాతల కాలం నుంచే....

అక్కడ గ్రామ పెద్దదే మాట. ఆయన మాటే శాసనం. పుల్లవిరిచి చేతిలో పెట్టారంటే చాలు. మాట తప్పరు.. మడమ తిప్పరు. ఇదీ కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని పలు తండాలవాసుల కట్టుబాటు. తాతల నాటి నుంచి వస్తున్న ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. ఎ. కొండూరు, గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట తండాల్లో ఇప్పటికీ ఇది అమలు చేస్తున్నారు. పుల్లవిరుపంటే ప్రమాణానికి సమానమని ఎన్నేళ్లైనా ఆ కట్టుబాటు అలాగే కొనసాగుతుందని గ్రామస్థులు చెబుతున్నారు.

పుల్లవిరుపు కోసం నిరీక్షణ...

ఎన్నికల్లో తమ అభ్యర్థిత్వం ఖరారైందంటే చాలు...రాజకీయ నాయకులు ఈ పుల్లల కోసం పరుగెడుతుంటారు. గ్రామపెద్దలతో మంతనాలు జరుపుతూ హామీల వర్షం కురిపిస్తారు. నగదు ఆశ చూపెడతారు. కానీ గ్రామస్థులు డబ్బులు తీసుకుని ఓట్లేసే రకం కాదు. గ్రామ పెద్దలు ఏం చెబితే అదే చేస్తారు. ఊరి బాగు కోసం వారు చెప్పిందే అక్కడ శాసనం.అన్ని పార్టీల నాయకులు చెప్పేది వింటారు. ఎవరిపై నమ్మకం కుదిరితే వారికి హామీ ఇస్తారు. ఓట్లు వేస్తామని పుల్లవిరిచి చెప్పేస్తారు. ఈ పుల్ల ఒప్పందం కుదిరితే చాలు ఓట్ల వరద ఖాయమన్న ధీమాలో ఉంటారు నాయకులు.

sample description
Last Updated : Mar 28, 2019, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.