గత నీటి సంవత్సరంలో కేటాయించి.. వినియోగించుకోకుండా రిజర్వాయర్లలో నిల్వ ఉంచుకొన్న (క్యారీ ఓవర్) నీటిని ప్రస్తుత ఏడాది వాడుకోవడంపై అభిప్రాయం చెప్పాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్‌ను కోరింది. 75 శాతం లభ్యత సంవత్సరాల్లో నీరు ఎక్కువగా వచ్చినప్పుడు నిల్వ చేసుకొని తక్కువ లభ్యత ఉండే 25 శాతం సంవత్సరాల్లో వాడుకోవడానికి బచావత్ ట్రైబ్యునల్ అవకాశం కల్పించిందని.. దీని ప్రకారం ప్రస్తుతం అవకాశం ఇవ్వాలని తెలంగాణ కోరింది. ఈ అంశంపై గతంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలోనూ, ఇటీవల జరిగిన కృష్ణా బోర్డు భేటీలోనూ చర్చించారు. దీనిపై వారం రోజుల్లో అభిప్రాయం చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ను బోర్డు కోరింది. అయినా, ఏపీ నుంచి సమాధానం రాకపోవడంతో తాజాగా బోర్డు సభ్యకార్యదర్శి ఎల్.బి.మౌంతంగ్ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు లేఖ రాశారు.
‘క్యారీ ఓవర్ నీటి’పై ఏపీకి కృష్ణా బోర్డు లేఖ - latest uopdate krishna board
రిజర్వాయర్లలో నిల్వ ఉంచుకొన్న (క్యారీ ఓవర్) నీటిని ప్రస్తుత ఏడాది వాడుకోవడంపై అభిప్రాయం చెప్పాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్‌ను కోరింది.
గత నీటి సంవత్సరంలో కేటాయించి.. వినియోగించుకోకుండా రిజర్వాయర్లలో నిల్వ ఉంచుకొన్న (క్యారీ ఓవర్) నీటిని ప్రస్తుత ఏడాది వాడుకోవడంపై అభిప్రాయం చెప్పాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్‌ను కోరింది. 75 శాతం లభ్యత సంవత్సరాల్లో నీరు ఎక్కువగా వచ్చినప్పుడు నిల్వ చేసుకొని తక్కువ లభ్యత ఉండే 25 శాతం సంవత్సరాల్లో వాడుకోవడానికి బచావత్ ట్రైబ్యునల్ అవకాశం కల్పించిందని.. దీని ప్రకారం ప్రస్తుతం అవకాశం ఇవ్వాలని తెలంగాణ కోరింది. ఈ అంశంపై గతంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలోనూ, ఇటీవల జరిగిన కృష్ణా బోర్డు భేటీలోనూ చర్చించారు. దీనిపై వారం రోజుల్లో అభిప్రాయం చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ను బోర్డు కోరింది. అయినా, ఏపీ నుంచి సమాధానం రాకపోవడంతో తాజాగా బోర్డు సభ్యకార్యదర్శి ఎల్.బి.మౌంతంగ్ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు లేఖ రాశారు.
ఇదీ చదవండి: కొత్త రాజ్యసభ సభ్యులు..రాజకీయ జీవితం