మాజీమంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌లు దుయ్యబట్టారు. బీసీలను అణగదొక్కేందుకు వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలను గౌరవించే వ్యక్తిని పోలీసులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు.
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారనే భయంతోనే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారని తెదేపా నేతలు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జీఎంఆర్‌తో ప్రభుత్వం ఒప్పందం