కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైద్య కళాశాల ఏర్పాటు పేరుతో మంత్రి పేర్నినాని భూ దోపిడీకి తెరలేపారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆరోపించారు. తెదేపా సానుభూతిపరులతో పాటు చిన్న సన్నకారు రైతుల భూముల్ని అసైన్డ్ భూములుగా చూపుతూ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూములు స్వాధీనం చేసుకోరాదని న్యాయస్థానం ఆదేశాలున్నప్పటికీ స్థానిక మంత్రి అధికారుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. వైద్య కళాశాల ఏర్పాటుకు వ్యతిరేకం కాదన్న ఆయన.. కావాల్సిన భూములకు పరిహారం చెల్లించి తీసుకోవాలని హితవు పలికారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఒకసెంటు భూమిని కుడా వదలమన్నారు. బాధితుల తరఫున న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సమస్యపై బాధిత రైతులతో కలసి ఆర్డీవోకు కొల్లు రవీంద్ర ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: