కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును బయటకు తీయడానికి 38 రోజులు పట్టడంపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బోటు బయటకు తీయడం తమ ఘనతగా మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ధర్మాడి సత్యం ముందుకొచ్చి తీయబట్టే ఐదు వారాల తర్వాత బోటు బయటపడిందన్నారు. బోటు ప్రమాదానికి వైకాపా ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణమన్నారు. 38 రోజుల పాటు బోటును గోదావరిలోనే వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం చేతకానితనం ఏంటో మునిగిన బోటును బయటకు తీయడంలోనే తేలిపోయిందన్నారు. మృతుల కుటుంబాల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
ఇదీ చదవండి
బోటు వెలికితీతపై ఆనందం.. బాధిత కుటుంబాలకు సంతాపం
: