తెదేపా అధినేత చంద్రబాబు సూచనలు చేసిన ప్రతిసారి మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కరోనా వ్యాపిస్తున్న సమయంలోనూ ఇసుక, మట్టి, గ్రావెల్‌ను దోచుకునేందుకు వైకాపా నాయకులకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మచిలీపట్నంలో కరోనా అనుమానితుడు చనిపోవడం ప్రభుత్వ వైఫల్యమే అని స్పష్టం చేశారు. అత్యవసర సేవలు అందించేవారికి సైతం మాస్కులు అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఇంత కష్టకాలంలోనూ వైకాపా రాజకీయాలు చేస్తుందన్నారు. ఆ పార్టీకి సమస్య పరిష్కారం కంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యమా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: