ETV Bharat / state

Hit OTT: 'హిట్'​ పేరుతో ఓటీటీ.. అదరగొట్టిన ప్రవాసాంధ్రుడు - telugu news

అమెరికాలో ఉన్న ఆంధ్రా యువకుడు హిట్ పేరుతో ఓ సరికొత్త ఓటీటీని రూపొందించాడు. 4కే నాణ్యతతో.. 30 భాషల్లో సినిమాలను ఈ వేదికపై విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

kollu-ranjith-created-a-ott-under-the-hit-name
హిట్​ పేరుతో ఓటీటీ.. అదరగొట్టిన ప్రవాసాంధ్రుడు
author img

By

Published : Dec 21, 2021, 10:43 AM IST

Updated : Dec 21, 2021, 2:13 PM IST

చిన్న సినిమాలకు థియేటర్లు దొరక్క కష్టాలు, మరికొన్నింటిని ఓవర్సీస్‌లో చూసేందుకు ప్రేక్షకులకు ఇబ్బందులు... వీటికి పరిష్కారంగా త్వరలోనే ఓ సరికొత్త ఓటీటీ అందుబాటులోకి రానుంది. 4కే నాణ్యతతో ఇందులో సినిమాలు అప్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని నిర్మాతలకే కల్పించారు. ఓ ప్రవాసాంధ్రుడే దీన్ని రూపొందించడం విశేషం.

'హిట్'​ పేరుతో ఓటీటీ.. అదరగొట్టిన ప్రవాసాంధ్రుడు

కొవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు... ఓటీటీల రుచి మరిగారు. భాషా భేదం లేకుండా ఏ సినిమా అయినా చూసేస్తున్నారు. ఓటీటీల్లో ప్రధానమైనవి ఒక ఐదారు ఉన్నాయి. వాటికి సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి. వీటికి పోటీగా... కొత్త విధానంతో మరో ఓటీటీ ప్లాట్‌ఫాం త్వరలోనే రానుంది. అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రుడు రంజిత్.... తన మిత్రుడు వెంకట్‌తో కలిసి హిట్ అనే ఓటీటీని రూపొందించారు. నిర్మాతలకు ఉపకరించేలా దీన్ని తీర్చిదిద్దారు. తమ సినిమాలను వారే అప్‌లోడ్ చేసి, టికెట్ ధరలు నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించారు.

ఈ ప్లాట్​ఫాంలో రిలీజ్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చు. వాళ్లే మేనేజ్ చేసుకోవచ్చు. సో వాళ్లకి ఎక్కువ దేశాల్లో రిలీజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఆదాయం వచ్చే స్కోప్ ఉంది. ఎక్కువ మందికి రీచ్ అయ్యే స్కోప్ ఉంది. ఆంధ్రాలో థియేటర్​లో రిలీజ్ చేసుకొని మిగతా చోట్ల ఓటీటీల్లో రిలీజ్ చేసుకోవచ్చు. సో వాళ్లకి ఎక్కువగా ఈ ప్లాట్​ఫాం మూలాన వాళ్లకి చాలా బెనిఫిట్ ఉంటుందండి. రాని ఆదాయం రావడానికి స్కోప్ ఉంటుందండి. దీన్ని సెల్ఫ్ పబ్లిషింగ్ అంటున్నామండి. ఎన్ని రోజులు పబ్లిక్ చూడొచ్చు, ఎన్ని గంటలు చూడొచ్చు, ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు, ఏ టైం జోన్​లో రిలీజ్ చేయొచ్చు... ఇండియన్ టైం జోనా? అమెరికన్ టైం జోనా? ప్రీబుకింగ్స్ కూడా వాళ్లే బుక్ చేసుకోవచ్చు. సినిమా రిలీజ్ అయ్యే ముందు ప్రీ బుకింగ్స్ అమ్మెటట్టు. - రంజిత్, 'హిట్' వ్యవస్థాపకుడు

విదేశాల్లో భారీ సినిమాలు మినహా ఓ మోస్తరు చిత్రాలు విడుదలవడం తక్కువే. ఒకవేళ అయినా సీట్లు నిండకపోతే షో రద్దు చేస్తారు. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాతలకు పెద్దగా ఏం మిగలదు. అదే.... 'హిట్'లో తమ సినిమాను విడుదల చేస్తే టికెట్ ధర నిర్ణయించే వీలు నిర్మాతలకే ఉంటుంది. ప్రస్తుతం 30 భాషల చిత్రాలను హిట్‌లో ఉంచేలా ఏర్పాట్లు చేశారు. ఇందులో కొత్త సినిమాలకే ప్రాధాన్యమిస్తున్నట్టు రంజిత్‌ చెబుతున్నారు.

టీవీ రెసెల్యూషన్​ని బట్టి టీవీకున్న కాన్ఫిగరేషన్​ బట్టి దాని ప్రకారం ఆటోమెటిక్​గా సాఫ్ట్​వేర్ డిటెక్ట్ చేస్తదండి. ఓకే ప్లే చేయాలా లేదా ఫుల్​ హెచ్​డీ ప్లే చేయాలా లేకపోతే 4కే కాకుండా నార్మల్ స్ట్రీమ్ ప్లే చేయాలా... మేం ఆటోమెటిక్​గా డికెట్ట్ చేసి ప్లే చేసేస్తామండి. రెండోది పైరసీ ప్రొటక్షన్ అన్ని ప్లాట్​ఫామ్స్ ఇవ్వరండి. సో అన్ని మూవీస్​కి ఇవ్వరు. కొన్ని మూవీస్​కి ఇస్తరు. మనం ప్రతీ మూవీకి పైరసీ ప్రొటక్షన్ టెక్నలాజికల్లీ పైరసీ ప్రొటక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. పైరసీ ప్రొటక్షన్​లో డీఆర్​ఎం టెక్నాలజీ అండ్ వాటర్​ మార్కింగ్ అంటామండి. డీఆర్​ఎంతో మనం డౌన్​లోడ్ చేయకుండా... స్క్రీన్ రికార్డు చేయకుండా అలాంటివి ప్రివెంట్ చేయొచ్చండి. - రంజిత్, 'హిట్' వ్యవస్థాపకుడు

ప్రేక్షకులకు మంచి అనుభూతి కల్పించడంతో పాటు వారి భద్రత తమ తొలి ప్రాధాన్యమని హిట్ వ్యవస్థాపకులు వివరించారు. హిట్ కోసం 18 నెలలు శ్రమించిన రంజిత్.... ప్రస్తుతం దాని గురించి నిర్మాతలకు చెప్పేందుకు భారత్‌కు వచ్చారు.

ఇదీ చూడండి:

CM TOUR: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం పర్యటన

Last Updated : Dec 21, 2021, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.