ETV Bharat / state

ప్రాంగణ నియామాకాల్లో కేఎల్​యూ ఘనత

ప్రాంగణ నియామాకాల్లో కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు రికార్డు స్థాయిలో ఉద్యోగాలు సాధించారని వర్సిటీ ఇన్​ఛార్జి ఉపకులపతి ఎన్ వెంకట్రామ్ తెలిపారు. వారి ఏడాది సరాసరి వేతనం రూ.5లక్షలు కాగా, అత్యధికం రూ.25 లక్షలుగా ఉందని వెల్లడించారు.

KL Deemed University
ప్రాంగణ నియామాకాల్లో కేఎల్​యూ ఘనత
author img

By

Published : Jun 27, 2021, 6:59 AM IST

ప్రాంగణ నియామాకాల్లో కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు రికార్డు స్థాయిలో ఉద్యోగాలు సాధించారని వర్సిటీ ఇన్​ఛార్జి ఉపకులపతి ఎన్. వెంకట్రామ్​ వెల్లడించారు. 2021వ సంవత్సరానికి ఇప్పటివరకూ 220కి పైగా జాతీయ, అంతర్జాతీయ కంపెన్లీల్లో 3వేల మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు. విజయవాడలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, బీబీఏ,బీఎస్సీ విద్యార్థులు కొలువులు సాధించినట్లు చెప్పారు. ఉద్యోగాలు పొందిన వారి ఏడాది సరాసరి వేతనం రూ.5లక్షలు కాగా, అత్యధికం రూ.25లక్షలుగా ఉందని వివరించారు. ప్రాంగణ నియామకాలకు సంబంధించిన గోడపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో యూనివర్సిటీ ప్లేస్​మెంట్స్ డీన్​ ఎస్.వెంకటేశ్వర్లు, వర్సిటీ అంతర్జాతీయ ప్రాంగణ నియామకాల డీన్​ ఎన్​.బి.వి.ప్రసాద్, ప్లేస్​మెంట్స్ డైరెక్టర్ శరవణబాబు, ఆడ్మిషన్స్ డైరెక్టర్ జె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

వారంలో పది, ఇంటర్ ఫలితాలను సిద్ధం చేయండి: మంత్రి సురేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.