తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాచిగూడలోని దీక్షా మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో... సతీమణి కావ్యతో కలిసి ఓటు వేశారు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ ఓటు వేసే హక్కు ఉందని చెప్పారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వాలు సరిగా పని చేయడం లేదని ప్రశ్నించడం కాదు. మంచి ప్రభుత్వాలు వచ్చే విధంగా సరియైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు.
ఇదీ చూడండి: