ETV Bharat / state

కనకదుర్గ పైవంతెన.. ఆగస్టు కల్లా పూర్తయ్యేనా.. నగర వాసుల ఆశ నెరవేరేనా! - విజయవాడ కనకదుర్గ పైవంతెన

రాష్ట్రంలోనే తొలిసారిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి విజయవాడలో నిర్మిస్తున్న 6 వరుసల కనకదుర్గ పైవంతెన పనులకు ఆది నుంచి అవాంతరాలే ఎదురవుతున్నాయి. పనుల పూర్తికి లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నా.. అనుకోని అవరోధాలతో గడువు మీద గడువు పొడిగింపు అనివార్యమే అవుతోంది. అదిగో...ఇదిగో అందుబాటులోకి వస్తోందంటూ చెప్తున్నా.. ఇప్పటివరకూ ఆ ఆశ నెరవేరలేదు. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయిన తరుణంలో... ఆగస్టు 15 నుంచి ట్రయిల్‌రన్‌కు ఫ్లైఓవర్ సిద్ధం చేస్తామని.. ఆగస్టు నెలాఖరుకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని గుత్తేదారు సంస్థ చెప్తోంది. ఈసారైనా అనుకున్న సమయానికి పనులు పూర్తయితే నగర వాసుల ట్రాఫిక్‌ కష్టాలు తీరినట్లే.

kanakadurga fly over works in vijayawada
విజయవాడ కనకదుర్గ పైవంతెన
author img

By

Published : Jul 17, 2020, 4:47 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరువగా కృష్ణానది మీదుగా వాహనాలు రయ్‌ రయ్‌ అంటూ దూసుకెళ్లేందుకు నిర్మిస్తోన్న కనకదుర్గ పైవంతెన పనులు ఇప్పటివరకు 95 శాతం పూర్తయ్యాయి. రూ. 311 కోట్ల వ్యయంతో, 2.6 కిలోమీటర్ల పొడవున వంతెన నిర్మాణం జరుగుతోంది. సోమా ఎంటర్‌ ప్రైజెస్‌ గుత్త సంస్థకు గత ప్రభుత్వం పనులు అప్పగించింది. వాస్తవంగా గతేడాది మే 14 నాటికే పనులు పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం అధికారులు ఆగస్టు 15ను గడువుగా నిర్ణయించారు. ఏడాదిలో పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థ పేర్కొని నాలుగేళ్లు గడచినా ఇంకా పనులు పూర్తి కాలేదు.

లాక్ డౌన్​తో ఇబ్బందులు

అన్నీ అనుకూలిస్తే ఈపాటికే విజయవాడ వాసుల ట్రాఫిక్‌ కష్టాలు తీరేవి. లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత ఈ పనులు చేస్తోన్న ఇతర రాష్ట్రాల కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీనివల్ల పనులు నెమ్మదించాయి. స్థానిక కార్మికుల సహాయంతో గుత్తేదారు సంస్థ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది.

95 శాతం పూర్తి

2015లో కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభించారు. దీనికి స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది కార్మికులను సోమా కంపెనీ తీసుకొచ్చింది. పిల్లర్ల నిర్మాణం, గడ్డర్లు, స్పాన్ల పనులను పూర్తి చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రీఫ్యాబ్రికేటెడ్‌ దిమ్మెలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం పైభాగం మొత్తం పూర్తయింది. 5 శాతం భౌతిక నిర్మాణ పనులు జరగాలి. 10 శాతం ఆర్ధికపరమైన పనులు ఉన్నాయని ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు చెబుతున్నారు.

రాజీవ్‌గాంధీ పార్కు వైపు అప్రోచ్‌ రహదారి నిర్మాణం చేయాల్సి ఉంది. వంతెన మొత్తం విద్యుదీకరణ, డివైడర్‌ పనులు పూర్తి చేశారు. వీటికి తుది మెరుగులు దిద్దాల్సి ఉంది. కుమ్మరిపాలెం వైపు నుంచి పైవంతెన దిగే సమయంలో జాతీయ రహదారికి అనుసంధానంలో చిన్నపాటి మార్పులపై ఇంజినీర్లు దృష్టి సారించారు. సాంకేతికంగా చిన్నపాటి లోపం ఉందని గుర్తించారు. పైనుంచి వేగంగా వచ్చే వాహనాలు, కింద నుంచి వచ్చే వాహనాలు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయాలు యోచిస్తున్నారు.

రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌తో కలిసి పనులను ప్రత్యక్షంగా పరిశీలించి.. గుత్తేదారు సంస్థకు, ఆర్‌అండ్‌బీ అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు.

ఇవీ చదవండి....

కృష్ణాపై కరోనా పడగ... కట్టడికి పోరాడుతున్న యంత్రాంగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.