ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలు చేసి ఆంధ్రుల ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తుందని కమలానంద భారతి పేర్కొన్నారు. విజయవాడలో అమరావతి ఐకాస ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన రాజధానిని ఉద్దేశించి మాట్లాడారు . భూములు ఇచ్చిన రైతులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 85 రోజులుగా మహిళలు రోడ్డుపైకి వచ్చి ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి వ్యవహరిస్తుందని ఆరోపించారు. పవిత్రమైన అమరావతి నుంచి రాజధానిని ఎవరూ మార్చలేరని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి..