పద్నాలుగు నెలల పెండింగ్ పారితోషకాలను తక్షణమే విడుదల చేయాలంటూ.. ఏపీ సెర్ప్ కల్యాణమిత్రల యూనియన్ కృష్ణా జిల్లా విజయవాడలో ధర్నాకు దిగింది. సెర్ప్, సోషల్ వెల్పేర్ శాఖలు తమకు సంబంధం లేదంటున్నాయని సిబ్బంది వాపోయారు. కల్యాణమిత్ర, పెళ్లి కానుక పథకాన్ని కొనసాగించాలని నినదించారు. తమకు న్యాయం చేయాలంటూ... సీఐటీయూ ఆధ్వర్యంలో 13 జిల్లాల ఉద్యోగులు డిమాండ్ చేశారు.
కల్యాణమిత్రను కొనసాగిస్తామని... రెట్టింపు పారితోషకం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు కల్యాణ మిత్రల సంఘం రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి గుర్తు చేశారు. పెళ్లి కానుక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఒక్క రూపాయి కేటాయించలేదని తెలిపారు. ఒక్కో ఉద్యోగికి సర్కారు రూ. లక్ష బాకీ పడినట్లు వెల్లడించారు. బకాయిలను తక్షణమే చెల్లించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చిరించారు.
ఇదీ చదవండి: 'పని భారం ఆధారంగా కొత్త మండలాలు, సిబ్బంది కావాలి'