పాఠశాల విద్యలో చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తోందని... నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి అన్నారు. అమరావతిలో సీఎం జగన్తో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న పలు కార్యక్రమాల గురించి సీఎం ఆయనకు వివరించారు. పేద మహిళలకు చేయూతనిచ్చే అమ్మఒడి పథకాన్ని కైలాస్ సత్యార్థి ప్రశంసించారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలకు తమ సంస్థ తరపున కూడా అన్ని రకాల సహాయ, సహకారాలందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఛైల్డ్ ఫ్రెండ్ స్టేట్ అన్న ఆయన.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల చిన్నారులకు కుల, సాంఘిక వివక్ష లేకుండా విద్య అందుతుందని భావిస్తున్నామన్నారు.
ఇవీ చదవండి