కృష్ణా జిల్లా విజయవాడ, కంచికచర్లలో ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలలో భాగంగా నగరంలో చాలా చోట్ల దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల ముందు వాటి యజామానులు బ్లీచింగ్ పౌడర్ చల్లి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్టీఆర్ కూడలి, పలు కాలనీల రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
ఇదీచూడండి. కరోనా ఎఫెక్ట్.... రాష్ట్ర సరిహద్దు మూసివేత