ETV Bharat / state

'అక్రమాలకు పాల్పడుతున్న అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలి'

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ నేతలు అనుసరిస్తున్న తీరుపై జనసేన నేత పోతిన మహేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆక్షేపించారు.

janasena leader pothina mahesh fire on ycp government about municipal elections
జనసేన నేత పోతిన మహేశ్
author img

By

Published : Mar 5, 2021, 5:29 PM IST

స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరపడమంటే అపహరణలు, ప్రలోభాలకు గురి చేయటమా అని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ఎద్దేవా చేశారు. విజయవాడ నగరంలో జనసేన-భాజపా బలపరిచిన అభ్యర్థిని కిడ్నాప్​న​కు యత్నించడం నిజం కాదా అని ప్రశ్నించారు. దొంగ ధ్రువీకరణ పత్రాలతో పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థిపై ఫిర్యాదు చేసినప్పటికీ... ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని.. అక్రమాలకు పాల్పడుతున్న అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి.

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిరసనలో వ్యాఖ్యాతగా ఎంపీ విజయసాయిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.