'వారికి రాముడి కల్యాణంలో పాల్గొనే అర్హత లేదు' - ఈరోజు జనసేన నేత పోతిన మహేష్ తాజా వ్యాఖ్యలు
రామతీర్థ ఘటన విచారణ ఎప్పటికి పూర్తవుతుందో.. శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని.. జనసేన నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. రామతీర్థ ఘటనలో రాములవారి తల నరికిన దుండగులను పట్టుకోలేని వారికి రాముల వారి కల్యాణంలో పాల్గొనే అర్హత లేదన్నారు.
జనసేన నేత పోతిన మహేష్
రామతీర్థ ఘటనలో రాముల వారి తల తెగనరికిన దుండగులను నేటి వరకు పట్టుకోకపోవటం.. దేవాదాయ శాఖ మంత్రి నిర్లక్ష్యమని జనసేన నేత పోతిన మహేష్ దుయ్యబట్టారు. దుండగులను పట్టుకోలేని వారు.. రాముల వారి కల్యాణంలో పాల్గొనడానికి అనర్హులు అని పేర్కొన్నారు. హిందువుల ఆచార వ్యవహారాలపై నమ్మకం లేని మంత్రి వెల్లంపల్లి శ్రీను.. రాముల వారి కళ్యాణంలో పాల్గొనడానికి అనర్హులని తేల్చి చెప్పారు. రామతీర్థ ఘటన విచారణ ఎప్పటికి పూర్తవుతుందో.. శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తారా అని జనసేన నేత పోతిన మహేష్ నిలదీశారు.