గృహ సముదాయాల్లో కరోనా ఐసోలేషన్ కేంద్రాలా..? అని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రశ్నించారు. సామాన్య మధ్యతరగతి మహిళల సొంత ఇంటి కలను కరోనా వైరస్‌తో దాడి చేయిస్తారా? అని మేయర్‌ను నిలదీశారు. కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తే.. అక్కడ పేద ప్రజలు గృహ ప్రవేశాలు ఎప్పటికి చేస్తారు అని మండిపడ్డారు. కరోనా ఇసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు.. ఇండోర్ స్టేడియం, కల్యాణ మండపాలు, చిన్న చిన్న హోటళ్లు, పెద్ద ఎత్తున గదుల వెసులుబాటు ఉన్న చోటు ఏర్పాటు చేయలేరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాలోచిత నిర్ణయంపై పునఃసమీక్ష చేయాలని.. పోతిన మహేష్ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి…: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. పరీక్షలకు ప్రజల ఇక్కట్లు