ప్రతిపక్ష నాయకుని హోదాలో జగన్ చేసింది ప్రజాసంకల్పయాత్ర కాదని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. అది ప్రజా వంచన యాత్ర అని విమర్శించారు. ప్రజాసంకల్ప యాత్ర 3 ఏళ్ల సంబరాలు చేసుకోవడానికి వైకాపా నేతలు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. సంకల్ప యాత్రలో జగన్ ఇచ్చిన హామీలు, మాటలు ఏమైపోయాయని ప్రశ్నించారు.
జగన్ పాలనలో దళితులు, మైనారిటీలు, బీసీ, బడుగు బలహీన వర్గాలు అష్టకష్టాలు పడుతున్నారన్నారని మహేష్ మండిపడ్డారు. 139 బీసీ కులాలకు 52 ఛైర్మన్ పదవులు ఇవ్వడం బీసీలను అవమానించడమేనన్నారు. నిధులులేని డైరక్టర్ పదవులు.. ఆకలితో ఉన్నవాడి ముందు ఖాళీ ఇస్తరాకు పెట్టినట్టు ఉందని జగన్ సర్కార్ పనితీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలు పాటించకుండా కరోనాను మరింతగా వ్యాప్తి చేసేలా వైకాపా నాయకులు సంబరాల పేరుతో ర్యాలీలు నిర్వహించడాన్ని ఖండిస్తున్నామన్నారు. జగన్ సర్కార్కు రానున్న రోజుల్లో దళితులు, మైనారిటీలు, బీసీలు, కాపులు సమాధి కట్టడం ఖాయమని విమర్శలు చేశారు.
ఇదీ చదవండి: దేశంలో లక్షా 25వేలు దాటిన కరోనా మరణాలు