ETV Bharat / state

కేంద్ర మంత్రి మురళీధరన్‌ పై దాడిని ఖండిస్తున్నాం: జనసేన - కేంద్రమంత్రి మురళీధరన్ పై దాడి

కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ పై దాడిని ఖండిస్తున్నామని జనసేన పార్టీ ప్రకటించింది. ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమబంగాలో వరుసగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

nadendla manohar
nadendla manohar
author img

By

Published : May 6, 2021, 7:03 PM IST

కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, పశ్చిమబంగా భాజపా రాష్ట్ర ఇంచార్జ్ వి.మురళీధరన్​పై దాడిని జనసేన పార్టీ ఖండించింది. ప్రజాస్వామ్యవాదులు అంతా ఈ దాడిని ఖండించాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమబంగాలో వరుసగా ఇలాంటి హింసాత్మక ఘటనలే చోటు చేసుకుంటున్నాయని మనోహర్ అన్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి కాన్వాయ్ మీద దాడి చేసిన తీరు చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు.

ఇదీ చదవండి:

కరోనా వేళ పెళ్లి..: నలుగురు పెద్దలపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.