ETV Bharat / state

కరోనా విజృంభణకు జగన్ సర్కార్ వైఫల్యమే కారణం: ఏలూరి - parchur mla eluri sambasiva rao latest News

ఏపీలో కరోనా కేసులు 7 లక్షల దాటి.. 6 వేల మందికిపైగా మరణించినా ముఖ్యమంత్రి జగన్ కొవిడ్ తీవ్రతను గుర్తించట్లేదని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మండిపడ్డారు. డబ్బుల కోసం బార్లు తెరిచి.. వైరస్ విజృంభణకు ప్రభుత్వమే కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా విజృంభణకు జగన్ సర్కార్ వైఫల్యమే కారణం : ఏలూరి

author img

By

Published : Oct 4, 2020, 10:18 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 7 లక్షల దాటినా.. 6 వేల మందికిపైగా చనిపోయినా సీఎం జగన్ వైరస్ తీవ్రతను గుర్తించట్లే దని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసులకు కక్కుర్తిపడి బార్లు తెరిచి వైరస్ విజృంభణకు కారకులయ్యారని మండిపడ్డారు.

పొరుగు రాష్ట్రాలు అలా..

ఓ వైపు పొరుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పరుగులు పెడుతుంటే.. ఏపీ మాత్రం కరోనా పెరుగుదలలో దూసుకుపోతోందని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా వైకాపా నాయకులున్నారని ఎద్దేవా చేశారు.

బాధాకరం..

కోలుకున్న వారికి ఆరోగ్య ఆసరా కింద ఇస్తామన్న రూ. 2 వేల సాయాన్ని మధ్యలోనే ఆపేశారన్నారు. కొవిడ్ మృతుల కుటుంబాలకు ఇస్తామన్న రూ.15 వేల సాయం అందిందని చెప్పినవారు ఒక్కరూ లేరని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 200 మంది విద్యార్థులు కరోనా బారిన పడటం బాధాకరమన్నారు. నవంబర్ 5 నుంచి పాఠశాలలు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వ అసమర్థతను కూడా చంద్రబాబు వైపే చూపిస్తున్నారని వైకాపా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

ఇవీ చూడండి:

ఈసారి వర్చువల్​గా డీజీపీలు, ఐజీపీల వార్షిక సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.