ETV Bharat / state

CHANDRABABU: తాలిబన్లను మించిపోయారు.. వైకాపా నేతలపై చంద్రబాబు ధ్వజం - విజయవాడ తెదేపా కార్యాలయం

వైకాపా నేతలకంటే తాలిబన్లే నయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి అరాచక విధానాలతో రాష్ట్రం 20ఏళ్లు వెనక్కి వెళ్లిందని మండిపడ్డారు. జగన్ రెడ్డి అవినీతి, అక్రమాలను చూస్తూ ఊరుకోవాలా అని నిలదీశారు. వైకాపా అరాచకాలను ప్రతిఘటించేందుకు ప్రజలు కూడా సిద్ధమయ్యారని చంద్రబాబు అన్నారు. తెదేపా నేతలపై తప్పుడు కేసులు నమోదు చేసే పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతామని చంద్రబాబు చెప్పారు.

Jagan is enjoying satanic pleasure like a maniac
జగన్ ఉన్మాదిలా పైశాచిక ఆనందం పొందుతున్నాడు
author img

By

Published : Sep 2, 2021, 3:34 PM IST

Updated : Sep 3, 2021, 6:55 AM IST

వైకాపా అరాచకాలను ప్రతిఘటించేందుకు ప్రజలు కూడా సిద్ధమయ్యారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. వైకాపా పాలనలో రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్‌ను కోల్పోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అప్పులు రూ. 5.35లక్షల కోట్లకు చేరాయని అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడమే తప్పైపోయిందని మండిపడ్డారు.

హైకోర్టు మందలిస్తే తప్పా ఉపాధి బిల్లులు చెల్లించరా...

ఉపాధి హామీ పనుల బిల్లులు చెల్లించకుండా రాక్షసంగా వ్యవహరించటంతో పాటు..మస్టర్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఐఏఎస్​ అధికారుల్ని హైకోర్టు మందలించి.. జైల్లో పెడతామని హెచ్చరిస్తే.. పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నారని విమర్శించారు. ప్రజల మేలు కోసం నాడు చేసిన అభివృద్ధి పనుల్ని రాజకీయం చేసి కాంట్రాక్టర్లను ఇబ్బందిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డి విశాఖలో భూ అక్రమాలకు పాల్పడుతుంటే, సజ్జల రామకృష్ణారెడ్డి.. డీజీపీ మాదిరిగా వ్యవరిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

సమస్యలన్నింటికీ ప్రజా చైతన్యమే పరిష్కారం
ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు జగన్ అరాచకాలకు బానిసలయ్యారని..ఇది సొంత రాజ్యాంగం కాదని గ్రహించాలని హితవు పలికారు. సమస్యలన్నింటికీ ప్రజా చైతన్యమే పరిష్కారమన్న చంద్రబాబు.. సమైక్యంగా పోరాడేందుకు తెదేపా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందని ప్రకటించారు. జగన్ రెడ్డి విధ్వంస విధానాలపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

రాష్ట్ర సంపదను కాపాడుకుందాం..

రెండున్నరేళ్లలోనే ప్రజలపై రూ. 9వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారని విమర్శించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ. 24వేల కోట్లు అప్పు తెచ్చి కూడా విద్యుత్ కోతలు విధిస్తుండటాన్ని నేతలు తప్పుబట్టారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి రైతుల గొంతుకు ఉరి బిగిస్తున్నారని మండిపడ్డారు. మద్యం ద్వారా రూ. 25 వేల కోట్లు, లాటరైట్ ముసుగులో రూ. 15వేల కోట్లు, ఇసుకలో రూ. 10 వేల కోట్లు, సెంటు పట్టా పేరిట రూ. 6,500 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డిన వైకాపా ప్రభుత్వం.. రంగులు మార్పుకు రూ.3 వేల కోట్ల దుర్వినియోగం చేసిందని సమావేశంలో ఆరోపించారు. వీటన్నింటిపై ప్రజల్ని చైతన్యపరిచి రాష్ట్ర సంపదను కాపాడుకునేలా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

దిశ పోలీస్ స్టేషన్ల వద్ద శాంతియుతంగా నిరసనలు తెలిపిన తెలుగు మహిళ, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకుల్ని నిర్బంధించడం రాజ్యాంగ వ్యతిరేకమని సమావేశంలో నేతలు తీర్మానించారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబుపై దౌర్జన్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వర్ల రామయ్య, ఆలపాటి రాజా, వంగలపూడి అనిత, బండారు సత్యనారాయణ మూర్తి, నూకసాని బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Sep 3, 2021, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.