ETV Bharat / state

తెలంగాణ: ఖమ్మంలోనే ఐటీ కొలువులు.. ఉద్యోగుల సంతోషం - ఖమ్మంలో ఐటీహబ్​లో ఉద్యోగుల సంతోషం

తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ ఎక్కడ చదివినా... ఐటీ కొలువులకు తప్పనిసరిగా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి నగరాల బాట పట్టాల్సిందే. అటువంటి ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరింపజేయాలని ప్రయత్నిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా ఖమ్మంలో అత్యాధునిక హంగులతో ఐటీహబ్‌ కొలువుదీరింది. డిసెంబర్‌ 7న మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం కాగా.. ఇక్కడ 16 బహుళ జాతి సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో సొంత జిల్లాలోనే ఐటీ ఉద్యోగం చేయడం పట్ల యువ ఇంజినీర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌కు దీటుగా ఖమ్మం ఐటీహబ్‌ను తీర్చిదిద్దడంలో తమ వంతు పాత్ర పోషిస్తామంటున్న యువ ఇంజినీర్లతో...ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి.

it hub in khammam
తెలంగాణ: ఖమ్మంలోనే ఐటీ కొలువులు.. ఉద్యోగుల సంతోషం
author img

By

Published : Dec 12, 2020, 11:50 AM IST

తెలంగాణ: ఖమ్మంలోనే ఐటీ కొలువులు.. ఉద్యోగుల సంతోషం

అత్యాధునిక హంగులతో ఖమ్మంలో ఐటీహబ్‌ కొలువుదీరింది. డిసెంబర్‌ 7న మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. 16 బహుళ జాతి సంస్థలు కార్యకలాపాలను 16 బహుళ జాతి సంస్థలు ప్రారంభించాయి. ఐటీహబ్‌లో 300 మంది ఇంజినీర్లు ఉద్యోగాలు చేస్తున్నారు. జాబ్‌మేళాలో ఉద్యోగాలు పొందిన యువ ఇంజినీర్లు... సొంత జిల్లాలోనే ఐటీ ఉద్యోగాలు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.

భద్రత పరంగా అమ్మాయిలకు సొంత జిల్లాలో ఐటీహబ్‌ ఉత్తమంగా భావిస్తున్నారు. ఉద్యోగాల కోసం మెట్రో నగరాల బాట పట్టాల్సిన అవసరం లేదని.. ఇంటి అద్దెలు, అనవసర ఖర్చులు తగ్గుతాయని యువ టెక్కీలు చెబుతున్నారు. జిల్లాలోనే పిల్లలకు ఉద్యోగాలు లభించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి :

నాలుగేళ్ల బాలుడిని.. బెల్టుతో వాతలు పడేలా కొట్టిన మేనమామ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.