ఈనెల 14వ తేదీ రాత్రి కొర్లమండ గ్రామ శివారులోని.. దాసాంజనేయ స్వామి గుడిలో గుర్తు తెలియని వ్యక్తులు హుండీని పగలకొట్టి రూ.2వేలను దొంగిలించారు. ఈ కేసుపై కృష్ణాజిల్లా ఎస్పీ నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపారు. మంగళవారం తెల్లవారుజామున కొర్లమండ శివారు విద్యానగరంలో అంతరాష్ట్ర నేరస్తుడు అయిన పఠాన్ సలార్ ఖాన్‌ను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. పఠాన్‌ను పోలీసులు విచారించగా.. జూలై 4వ తేదీన జగ్గయ్యపేట.. చిల్లకల్లు గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి హుండీలో 6వేలు, ఈనెల 8వ తేదీన మైలవరం మండలం ఎదురుబీడం గ్రామం రామాలయం గుడి హుండీలో 10వేలను దొంగిలించినట్లు తేలింది. నిందితుడి మీద రాష్ట్రంలో పలు పోలీసు స్టేషన్లలో సుమారు 80 కేసులు నమోదైన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని తిరువూరు కోర్టులో హాజరు పరచనున్నట్లు తిరువూరు సీఐ శేఖర్ బాబు తెలిపారు.
ఇదీ చదవండి: