ETV Bharat / state

మన మాతృభాష తేట తెలుగు తీయదనం అందరికీ పంచాలి: మంత్రి బొత్స

International Mother Language Day : విజయవాడలో రాష్ట్ర అధికార భాషా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించారు. తెలుగు భాష కోసం కృషి చేసిన పలువురికి మాతృభాష సేవా శిరోమణి అవార్డులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదగా అందించారు.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
author img

By

Published : Feb 21, 2023, 10:39 PM IST

International Mother Language Day : విజయవాడలో రాష్ట్ర అధికార భాషా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. తెలుగు భాష కోసం కృషి చేసిన పలువురికి మాతృభాష సేవా శిరోమణి అవార్డులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా అందించారు. మాతృభాషలో మాట్లాడటంలో ఉండే సంతృప్తి ఇక ఏ భాషలో మాట్లాడినా రాదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం తప్పక ఆచరించి.. మన మాతృభాష తేట తెలుగు తీయదనాన్ని అందరికీ తెలియ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విజయవాడలో రాష్ట్ర అధికార భాషా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. తెలుగు భాష కోసం కృషి చేసిన పలువురికి మాతృభాష సేవా శిరోమణి అవార్డులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారని, తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేదని.. చాలా మంది కవులు చెప్పారన్నారు. తెలుగు భాషా పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. భాషను పరిరక్షించుకుంటేనే ఇతర భాషలను నేర్చుకోవాలని సూచించారు. ఇతర బాషల ప్రభావం మాతృభాషపై పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయ్ బాబు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ప్రస్తుతం ఎన్నో రకాల వ్యాపకాలతో తలమునకలైన యువత.. మాతృభాషా దినోత్సవం కార్యక్రమానికి హాజరు కావడం గొప్ప విజయం. ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. మూడున్నర దశాబ్దాలుగా సాహిత్యం, జర్నలిజంలో అనుభవం గడించిన నాకు చైర్మన్ గా అవకాశం రావడం, అన్ని కార్యక్రమాలనూ వినూత్నంగా నిర్వహిస్తున్నాం. ఓ వైపు సాహిత్యకారులు, మరోవైపు విద్యార్థులు ఉండడం ద్వారా వారు ఎంతో కొంత నేర్చుకునే అవకాశం ఉంది. - విజయ్ బాబు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు

ఇవి చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.