కృష్ణా జిల్లా వ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అందుకు ప్రత్యేకంగా 5 బృందాలను ఏర్పాటు చేశారు. అనధికారంగా ప్రయాణికులను చేరవేస్తూ పట్టుబడిన 10 వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.
రవాణా వాహనాలకు ఫిట్నెస్ పర్మిట్ తప్పనిసరిగా కలిగి ఉండాలని జిల్లా రవాణా శాఖ ఉపకమిషనర్ (డీటీసీ) పురేంద్ర తెలిపారు. పన్నులు చెల్లించకపోయినా, పర్మిట్లు లేకపోయినా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. రవాణాశాఖ ఆదాయానికి గండి కొడితే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: