కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో తెల్లవారుజాము నుంచి పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. సారా రహిత గ్రామాల పునర్నిర్మాణమే ధ్యేయంగా తనిఖీలు చేపట్టినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. ఈ దాడులలో 110 లీటర్ల కాపుసారా, 6 వేల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసి, 20 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిని రిమాండ్‌కి పంపనున్నట్లు వివరించారు. సారా తయారీ క్రయవిక్రయాలు సరఫరాపై ఎలాంటి సమాచారం ఉన్నా.. తమకు తెలియ చేయాలని కోరారు. ఈ దాడుల్లో నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు, చాట్రాయి ఎస్ఐ కె శివ నారాయణ, నూజివీడు డివిజన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి...