కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో తెదేపా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిరసన చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు కంచికచెర్ల-మధిర రహదారిపై గుంతలు ఏర్పడి రోడ్లు ధ్వంసమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించట్లేదని మండిపడ్డారు. అందుకే గుంతల్లో నాట్లు వేసి వినూత్న రీతిలో నిరసన చేపట్టానని ఆమె స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : 'రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే ఇవ్వాలి'