ETV Bharat / state

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం.. బీఆర్ఎస్ వైఖరేంటి..? : మంత్రి అమర్నాథ్ - Bidding

inister Gudiwada Amarnath : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీఆర్ఎస్ పార్టీ అనుకూలమా.. వ్యతిరేకమా అనే విషయాన్ని స్పష్టం చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీ స్పష్టమైన నిర్ణయానికి కట్టుబడి ఉన్నదని మంత్రి స్పష్టం చేశారు. బిడ్డింగ్​లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనే అవకాశం లేదని చెప్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు పాల్గొనకుండా గతేడాది కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను మంత్రి గుర్తుచేశారు.

మంత్రి అమర్నాథ్
మంత్రి అమర్నాథ్
author img

By

Published : Apr 11, 2023, 10:17 PM IST

Updated : Apr 12, 2023, 6:16 AM IST

inister Gudiwada Amarnath : విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్).. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమో, అనుకూలమో చెప్పాలని అన్నారు. వ్యతిరేకమైతే బిడ్డింగ్​లో ఎలా పాల్గొంటున్నారని ప్రశ్నించారు. ఏడాదిన్నర క్రితం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన మెమోరాండంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిడ్డింగ్​లో పాల్గొనే అవకాశం లేదని స్పష్టం చేసిందని మంత్రి వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖ 2022 ఏప్రిల్ 19న జనరల్ పాలసీని విడుదల చేసిందని.. దాని ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు, కో ఆపరేటిన్ సొసైటీ సంస్థలు పాల్గొనే అవకాశం లేదని స్పష్టం చేసింది అని మంత్రి తెలిపారు. అసలు భారత రాష్ట్ర సమితి పార్టీ వైఖరి ఏమిటో తెలంగాణ అధికారులు లేదా అక్కడి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్​ను కాపాడుకోవాలనేది తమ ప్రభుత్వ విధానమని అన్నారు. ప్రైవేటీకరణకు తాము కూడా వ్యతిరేకమేనన్నారు. సీఎం జగన్ కూడా ప్రధాన మంత్రికి ఇదే చెప్పారని తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. ఇదే మా నినాదమని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు.

కాగా, కేంద్రం జారీ చేసిన మెమోరాండంపై తెలంగాణ ప్రభుత్వానికి అవగాహన లేదంటారా..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. బిడ్డింగ్​లో పాల్గొనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని మంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాకుండా సింగరేణి సంస్థ తరఫున బిడ్డింగ్​లో పాల్గొనే అవకాశం ఉంటుందా అని ప్రశ్నించగా.. సింగరేణి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ అయినందున అవకాశాల్లేవని మంత్రి స్పష్టం చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వస్తున్న అంచనాలు, ప్రచారాలు గమనిస్తున్నాం. బిడ్డింగ్​లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటుందని, అక్కడ అధికారంలో ఉన్న బీఆర్​ఎస్ పార్టీ ప్రకటనలు చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంటు విషయంలో ఏపీ ప్రభుత్వం, వైఎస్సార్సీపీ ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉన్నాయి. ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం అని చాలా స్పష్టంగా చెప్పాం. అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ బిడ్డింగ్​లో పాల్గొంటున్నారని తెలిసింది. ఈ మేరకు సింగరేణి నుంచి ఓ బృందం వస్తున్నట్లు సమాచారం అందింది. అయితే, బీఆర్ఎస్ పార్టీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని చెప్పింది. ఇదే విషయాన్ని కేసీఆర్, కేటీఆర్ చెప్పారు. వారు బిడ్డింగ్​లో పాల్గొనడాన్ని ఎలా చూడాలి? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా కాదా? వాస్తవానికి కేంద్రం గతేడాది విడుదల చేసిన మెమోరాండంలో పారిశ్రామిక విధానాన్ని స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిడ్డింగ్​లో పాల్గొనే అవకాశం లేదని అందులో పేర్కొంది. బిడ్డింగ్​లో పాల్గొనే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం, ట్రేడ్ యూనియన్లు పూర్తి వ్యతిరేకం. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. - గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి

ఇవీ చదవండి :

Last Updated : Apr 12, 2023, 6:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.