మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ విజయవాడ జవహర్ ఆటోనగర్లో పారిశ్రామిక కార్మిక అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పారిశ్రామికవేత్తలు, కార్మికులు, వివిధ చేతివృత్తుల కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జాతీయ జెండాలు, ప్లకార్డులు చేతబట్టి మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అమరావతి ఆంధ్రుల హక్కు, రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ర్యాలీగా వెళుతున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని, అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పోయిందని, పరిశ్రమల పరిస్థితి అయోమయంగా మారిందని పారిశ్రామికవేత్తలు అన్నారు.
ఇవీ చదవండి