Fashion show: యువర్ ఫెస్ట్ పేరిట కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులోని.. ఉషారామా ఇంజినీరింగ్ కళాశాలలో సంప్రదాయ చీరకట్టు పోటీలు నిర్వహించారు. తెలుగు సంప్రదాయ విలువలు నేటితరం యువతులకు తెలిజేయాలనే ఉద్దేశంతో తెలుగుమ్మాయి పోటీలను ఏటా నిర్వహిస్తున్నారు. పోటీల్లో పాల్గొన్న అమ్మాయిలు పట్టు చీరలు,నగలు ధరించి ర్యాంపుపై నడుస్తూ సందడి చేశారు. అందంగా ముస్తాబైన యువతులు.. వేదిక పై నడవడానికి పోటిపడ్డారు. పోటీల్లో గెలిచిన అమ్మాయిలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఇదీ చదవండి: ప్లాస్టిక్ వ్యర్థాలతో.. విద్యార్థుల చేతులు అద్భుతాలు చేశాయి!