ఆంధ్రా అబ్బాయి.. అఫ్గనిస్థాన్ అమ్మాయి ఒక్కటయ్యారు. పెద్దల సమక్షంలో హిందూ వివాహ సంప్రదాయ పద్ధతిలో మూడు ముళ్ల బంధంతో, ఏడు అడుగులు నడిచారు. విజయవాడలో జరిగిన వివాహ రిసెప్షన్లో ఆహ్వానితులు నవ దంపతులును ఆశీర్వదించారు.
రైల్వే డీఎస్పీగా పనిచేస్తున్న అశోక్ కుమార్, లక్ష్మీ మహేశ్వరి దంపతుల కుమారుడు వివేకానంద రామన్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు . దిల్లీలో చదువుకునే సమయంలో అఫ్గనిస్థాన్‌కు చెందిన అమ్మాయి ఫ్రూగ్ షిరిన్తో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారింది . ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని .. ఇంట్లో పెద్దలకు వారి ప్రేమ విషయం చెప్పారు. సినిమాల తరహాలో ట్విస్ట్‌లు లేకుండా ఇరువైపుల పెద్దలు పెళ్లికి అంగీకరించారు .
ఆమె తనకు నచ్చిందని.. ఇద్దరి ప్రేమను ఇంట్లో వాళ్లు అంగీకరించి పెళ్లి చేయడం ఆనందంగా ఉందని వరుడు వివేకానంద రామన్ చెప్పారు. తమకు కుల,మతాల పట్టింపు లేదని అశోక్ కుమార్ అన్నారు. పెద్దలుగా తమ మీద గౌరవంతో విషయం చెప్పటంతో పిల్లల ఇష్టం తెలుసుకుని పెళ్లి చేశామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి