విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురంలో రూ.1.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీని అధికారం నుంచి దించే వరకు నిద్రపోనని చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. నిలకడ లేని నాయకుడు రాజకీయాలకు పనికిరాడని విమర్శించారు. ఇదే విధానంతో కొనసాగితే రాష్ట్రంలో తిరిగే నైతిక హక్కునూ పవన్ కల్యాణ్ కోల్పోయే అవకాశాలున్నాయని మంత్రి అన్నారు.
ఇవీ చదవండి: