తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో ఒక ఇంటి నంబర్‌పై గుర్తు తెలియని వ్యక్తుల ఓట్లు రావడం చర్చకు తెర తీసింది. ఈ నెల 14న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో... ఓట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఓటరు స్లిప్‌లను రెవిన్యూ సిబ్బంది అందిస్తోంది.
ఈ క్రమంలో పట్టణంలోని రైటర్ బస్తీకి చెందిన 15 వార్డులో 8 -3- 19 నెంబర్ గల ఇంటికి 20 ఓట్లు వచ్చాయి. దీంతో ఇంటి యజమానులు అవాక్కయ్యారు. అందులో 3 ఓట్లు మినహా మిగిలిన ఓట్లు ఆ ఇంటి కి సంబంధించినవి కావని వారు తెలిపారు. తమ ఇంటి నుంచి నలుగురు ఓటరు నమోదు చేసుకోగా కేవలం ముగ్గురికి మాత్రమే ఓటు హక్కు లభించిందిని మిగిలిన వారు ఎవరో తనకు తెలియదని ఇంటి యజమానురాలు వివరించారు.
ఇదీ చదవండి:'ఓట్ల లెక్కింపు అనంతరం.. ఆందోళన ఉద్ధృతం చేస్తాం'