కృష్ణాజిల్లా నందిగామ డీవీఆర్ కాలనీలో తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెను తొలగించి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసేందుకు వైకాపా నాయకులు ప్రయత్నించారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తెదేపా నేతలు రాస్తారోకో నిర్వహించారు.
విషయం తెలుసుకున్న నందిగామ సీఐ కనకారావు సంఘటనా స్థలానికి చేరుకొని వైకాపా నాయకులతో మాట్లాడారు. తెదేపాజండా దిమ్మెను యధావిధిగా ఏర్పాటు చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: 20 రోజుల్లోనే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా?: ఎంపీ రామ్మోహన్