కృష్ణా జిల్లా చందర్లపాడులో విజయవాడ - ధర్మపురి హెచ్‌పీసీఎల్ పైపులైను వేసేందుకు రైతులతో హెచ్‌పీసీఎల్ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. పైప్‌లైన్ వేసిన తర్వాత తమ భూమి విలువ అనూహ్యంగా పడిపోతుందని రైతులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రైతులకు న్యాయం చేయాలంటే ముందుగా మార్కెట్ ధర నాలుగురెట్లతోపాటు భూమి మొత్తానికి పరిహారం చెల్లించిన తర్వాతే పైప్‌లైన్ వేయాలన్నారు. హెచ్‌పీసీఎల్ యాజమాన్యం, రెవెన్యూ అధికారులతో కలిసి పైప్‌లైన్ వేస్తే అడ్డుకుంటామని రైతులు అన్నారు.
ఇదీ చూడండి అంబులెన్స్కే యాక్సిడెంట్ అయ్యింది