ETV Bharat / state

మీరు చూడాలంటే... నేను ఉండాల్సిందే!! - vitamins news

స్కూలుకి వెళ్లకముందే  ఏ.బి. సి. డిలు నేర్చుకుంటాం...మరి వీటితో విటమిన్ల పేర్లూ ఉన్నాయని తెలుసా? విటమిన్ ఎ.  విటమిన్ బి.. ఇలా బోలెడన్ని.. వీటిల్లో దాని సంగతులు చెప్పాలని విటమిన్ 'ఎ' మనను పలకరిస్తోంది!

మీరు చూడాలంటే... నేను ఉండాల్సిందే!!
మీరు చూడాలంటే... నేను ఉండాల్సిందే!!
author img

By

Published : Dec 15, 2019, 8:31 AM IST

ఇప్పుడంటే మీరు నన్ను విటమిన్‌ 'ఎ' అని పిలుచుకుంటున్నారు గానీ మొదట్లో నాకు ఏ పేరూ లేదు! అప్పుడెప్పుడో 1816లో ప్రాంకోయిస్‌ మ్యాగెండీ అనే డాక్టర్‌... కుక్కలు త్వరగా చనిపోవటానికి, వాటి కంట్లోని కార్నియాలో పుండ్లకు ఒక పోషకం కారణమవుతోందని అనుమానించాడు. 1912లో ఫ్రెడెరిక్‌ గోలాండ్‌ హాప్కిన్స్‌ అనే శాస్త్రవేత్త పాలలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులే కాకుండా ఎలుకలు పెరగటానికి తోడ్పడే కొన్ని పోషకాలేవో ఉన్నాయని గుర్తించాడు. దీన్ని కనుగొన్నందుకు ఆయనకు 1929లో నోబెల్‌ బహుమతీ వచ్చింది. ఆ తర్వాత ఈ పోషకాల్లో ఒకదాన్ని నేనేనని ఎల్మర్‌ మెక్‌కోలమ్‌, మార్గరెట్‌ డవిస్‌ గుర్తించారు. మొదట్లో నన్ను ‘కొవ్వులో కరిగే పోషకం’ అనేవారు. 1920లో విటమిన్‌ 'ఎ' అని పిలుస్తున్నారు.

క్యారెట్లు తింటే చీకట్లో కళ్లు బాగా కనిపిస్తాయని వినే ఉంటారు. ఈ ప్రచారం వెనక చిత్రమైన కథే ఉంది. రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు జర్మనీ సైనికులు బ్రిటిష్‌ వాళ్ల కళ్లు కప్పేందుకు రాత్రిపూట విమానాల నుంచి బాంబులు వేసేవారు. విటమిన్‌ 'ఎ' దండిగా ఉండే క్యారెట్లు ఎక్కువగా తినటం వల్లనే అలా చేయగలిగారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో క్యారెట్లు తింటే చీకట్లో కళ్లు బాగా కనిపిస్తాయనే ప్రచారం వ్యాపించింది.

అవడానికి నేను ఒక్కటే కావొచ్చు. కానీ రెటినోల్‌, రెటినోయిక్‌ ఆమ్లం, రెటినల్‌, బీటా కెరటిన్‌ వంటి కెరొటినాయిడ్లు.. ఇలా వివిధ రూపాల్లో ఉంటాను. కొవ్వులో తేలికగా కరిగిపోతాను. మీకు కళ్లు బాగా కనిపించటంలో నా పాత్రే చాలా ఎక్కువ. రెటినల్‌ రూపంలో మీ కంట్లో ఓప్సిన్‌ అనే ప్రోటీన్‌తో కలిసిపోయి రాడాప్సిన్‌గా మారిపోతాను. దీని ద్వారా రకరకాల రంగులు, మసక చీకటిలో దృశ్యాలు కనిపించేలా చేస్తాను. ఇంకా ఎముకల జీవక్రియలో పాల్గొంటూ అస్థి పంజరం ఎదిగేలా చేస్తాను. జిగురు పొరలు ఆరోగ్యంగా ఉండటానికి, జన్యువులు పని చేయటానికి తోడ్పడతా. మీ చర్మం నిగనిగలాడటానికి, దంతాలు దృఢంగా ఉండటానికీ ఉపయోగపడతాను. అంతేనా? రోగనిరోధక శక్తినీ బలోపేతం చేస్తాను. ముఖ్యంగా రోగనిరోధక కణాల్లో భాగమైన 'టి' కణాల వృద్ధికి తోడ్పడతాను. ఇలా ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడతాను. అందుకే నన్ను యాంటీఇన్‌ఫెక్షన్‌ విటమిన్‌ అనీ అంటుంటారు.

నేను ఎక్కువగా ఎక్కడుంటానో తెలుసా?

నేను ఎక్కువగా ఎక్కడ ఉంటానో తెలుసా? క్యారెట్లు, గుమ్మడి, చిలగడ దుంప, మామిడి పండ్లు, అప్రికాట్ల వంటి నారింజ, పసుపుపచ్చ పండ్లు, కూరగాయల్లో. వీటిల్లోని బీటా కెరటిన్‌ వంటి కెరటినాయిడ్లను మీ శరీరంలోకి చేరుకున్నాక నాలాగా మార్చేసుకుంటా. అలాగే పాలకూర వంటి తాజా ఆకు కూరలూ నా నివాసాలే. కాడ్‌ చేప కాలేయం నూనె, కాలేయం, పాలు, ఛీజ్‌, వెన్న, గుడ్డులోని పచ్చసొన ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని పదార్థాల్లో మీ కోసం కాచుకొని ఉంటాను. మీకు అప్పటికి అవసరం లేకపోతే నిల్వ ఉండిపోతాను. అవసరమైనప్పుడు పనిలోకి దూకుతాను.

మీరు రోజూ నడవటం, పరుగెత్తటం, చదవటం, రాయటం ఇలా ఎన్నో పనులు చేస్తుంటారుగా. ఇవన్నీ చేయటానికి కావాల్సిన శక్తిని, ఉత్సాహాన్ని నాలాంటి విటమిన్లే అందిస్తాయి. అందుకే ఈసారి భోజనం చేసేటప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ గుర్తుంచుకోండి. మీరు తినే పదార్థాల్లో నేను ఉన్నానో లేదో ఓసారి చూసుకోండి. అమ్మ పెట్టినవన్నీ ఎంచక్కా తినేయండి. సరేనా!’’

Hyderabad, Dec 15 (ANI): At least four people were arrested for allegedly setting ablaze a watchman on intervening night of 6-7 Dec, who later succumbed to injuries on December 13. Anjani Kumar, Commissioner of Police of Hyderabad city said, "According to complainant, accused had attacked deceased over a land dispute case."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.