కృష్ణా జిల్లా వీరులపాడు, కంచికచర్ల మండలాల్లో ఎస్ఈబీ సీఐ స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 370 మద్యం సీసాలు, ఒక ద్విచక్రవాహనం, కారును స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురుని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీచదవండి.