ETV Bharat / state

జోరుగా సాగుతున్న అక్రమ మద్యం రవాణా - అక్రమ మద్యం రవాణా

రాష్ట్రంలో అక్రమ మద్యం రవాణా జోరుగా సాగుతున్నాయి. స్థానికంగా వీటి ధరలు అధికంగా ఉండటంతో...పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా సరఫరా చేస్తున్నారు. ఒకప్పుడు మద్యం నిషేధించిన గ్రామాలే... నేడు అదే జీవనోపాధిగా మలుచుకున్నాయి. దీంతో గ్రామస్తులకు, గొలుసు మద్యం దుకాణ వ్యాపారస్తులకు మద్య పోటీ పెరిగి వివాదాస్పద వాతావరణం నెలకొంటోంది.

Illegal  liquor
అక్రమ మద్యం రవాణా
author img

By

Published : Nov 3, 2020, 8:01 AM IST

రాష్ట్ర వాప్తంగా అక్రమ మద్యం రవాణాను నిరోధించడానికి అధికారులు ఒక ప్రక్కన ఎంత కష్టపడుతున్నా.... మరో వైపు ఆంధ్రా- తెలంగాణ సరిహద్దుల్లోని గ్రామాల్లో మద్యం అమ్మకాలు మాత్రం అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఆంధ్రా సరిహద్దులలో ఉన్న తెలంగాణ గ్రామాలైన గంగినేని సరిహద్దులోని కొత్తపాలెం, అనంతవరం సరిహద్దులోని గట్ల గౌరవరం, మొర్సుమిల్లి సరిహద్దులోని రాజుపాలెం, కాసవరం గ్రామాల్లో ఏకంగా ఇళ్లలోనే మద్యం అమ్ముతున్నారు గ్రామస్తులు. గతంలో తమ గ్రామాల్లో మద్యం అమ్మడానికి వీల్లేదని నిరసనలు చేపట్టిన గ్రామస్తులే తెలంగాణ ఎక్సైజ్ శాఖ చూసీ చూడనట్లు వ్యవహరించడంతో తెలంగాణ మద్యాన్ని ఆంధ్రా మందుబాబులకు విక్రయిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్ధికంగా దెబ్బ తినటంతో తమ కుటుంబాల పోషణకు ఈ వృత్తిని జీవనోపాధిగా ఎంచుకోక తప్పడంలేదని వాపోతున్నారు.

వ్యవసాయాధారిత గ్రామాల్లో వ్యవసాయం చేస్తూ పంటలను పండించాల్సిన రైతు వారీ కుటుంబాలు కూడా మద్యం అమ్మకాలు చేపట్టి ఇళ్లలోనే దుకాణాలు నిర్వహిస్తూ పెడత్రోవ పడుతున్నారు. గతంలో మద్యం అమ్మకాలను వ్యతిరేకించిన గ్రామస్తులే అమ్మకాలకు తెగబడటంతో పలు గ్రామాల్లో గ్రామస్తులకు,గొలుసు మద్యం దుకాణ వ్యాపారస్తులకు మద్య పోటీ పెరిగి వివాదాలు జరుగుతున్నాయి. గతంలో తెదేపా నాయకులు,మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఈ విషయంపై ధ్వజమెత్తగా... మైలవరం ఎమ్మల్యే వసంత కృష్ణ ప్రసాదు సరిహద్దుల్లోని గ్రామాల్లో గొలుసు దుకాణాల కట్టడికి అధికారులకు సూచనలిచ్చిచారు.

అయినప్పటికి ఈ మద్యం విక్రయాలు ఆడకపోవడం అటు తెలంగాణ ఎక్సైజ్, పోలీస్ శాఖ తీరుపై ప్రజల్లో అపోహలు రేకెత్తిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో తెలంగాణ సరిహద్దులోని ఎర్రుపాలెం,బనిగండ్లపాడు,మీనవోలు గ్రామాల్లో లైసెన్స్ పొందిన మద్యం వ్యాపారస్తులు ఇదే అదనుగా... ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యాన్ని అమ్ముతూ కాసులు దండుకుంటున్నారు. మద్యం సీసాలను చిన్నపాటి లాభాలతో అమ్ముకుంటూ ఇళ్లలోనే మందు బాబులకు కుర్చీలు వేసి మరీ మద్యాన్ని సరఫరా చేస్తున్న క్రమంలో గ్రామ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇప్పటికైనా అటు తెలంగాణ ఆబ్కారీ శాఖ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే పచ్చటి పంటపొలాలతో కళకళలాడాల్సిన గ్రామ వాతావరణం కలుషితం కాకపోదనడంలో అతిశయోక్తి లేదు.

ఇదీ చదవండీ...

సీఎం.. సలహాదారుల చర్య కోర్టు ధిక్కరణే..! కానీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.