ETV Bharat / state

గడ్డి వాముల్లో దాచారు... పోలీసులు పట్టుకున్నారు - మంతెనలో అక్రమంగా మద్యం రవాణా వార్తలు

రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో... కొంతమంది వ్యక్తులు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తీసుకువస్తున్నారు. అరుణాచల్​ప్రదేశ్ నుంచి తీసుకువస్తున్న మద్యం సీసాలను కృష్ణా జిల్లా మంతెనలో ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

illegal liquor seized in manthena krishna district
స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలతో పోలీసులు
author img

By

Published : Jun 6, 2020, 1:30 PM IST

Updated : Jun 6, 2020, 11:36 PM IST

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెనలో అరుణాచల్​ప్రదేశ్ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల గ్రామానికి చెందిన వీరంకి వెంకట రమణ మొక్కజొన్న లోడు లారీలో 142 కేసుల మద్యం తరలించాడు.

వాటిలో కొన్నింటిని ఇతరులకు అమ్మగా... గన్నవరం మండలంలో ఎన్​ఫోర్స్​మెంట్ అధికారుల దాడిలో అవి బయటపడ్డాయి. వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. వెంకటరమణ గడ్డివాముల కింద దాచిన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి.. గురుకులాల్లో చదివే ప్రతి విద్యార్థికీ స్మార్ట్‌ ఫోన్‌

Last Updated : Jun 6, 2020, 11:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.