ETV Bharat / state

అక్రమ మద్యం పట్టివేత...నాటుసారా బట్టీలు ధ్వంసం - అనంతపురంలో నాటుసారా బట్టీలు ధ్వంసం వార్తలు

రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం రవాణా కొనసాగుతునే ఉంది. తెలంగాణ ఖమ్మం జిల్లా బాణాపురం నుంచి కృష్ణా జిల్లాకు అక్రమంగా తరలిస్తోన్న 450 మద్యం సీసాలను చిల్లకల్లు పోలీసులు పట్టుకున్నారు. ఒకరిని అరెస్టు చేశారు. మరో వైపు అనంతరం జిల్లా గంతకల్లు పరిధిలో పోలీసులు నాటుసారా స్థావరాలపై కార్డన్ సెర్చ్ చేశారు. నియోజకవర్గంలోని తండా ప్రాంతాల్లో మొత్తం 3200 లీటర్ల నాటుసారా బెల్లం ఊట ధ్వంసం చేశారు.

Illegal liquor
Illegal liquor
author img

By

Published : Nov 30, 2020, 4:26 AM IST

ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో కృష్ణా జిల్లా గండ్రాయి శివారు ఎన్​ఎస్​పీ కాల్వ వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని చిల్లకల్లు పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా బాణాపురం నుంచి వత్సవాయి మండలం మక్కపేట గ్రామానికి 450 మద్యం సీసాలు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపించారు. ఈ మద్యం విలువ సుమారు రూ.54 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

గుంతకల్లు నియోజకవర్గ పరిధిలో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ పరిధిలో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు చేశారు. ఆదివారం గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తి , గుంతకల్లు, పామిడి, పెద్దవడుగూరు మండలాల్లోని తండా ప్రాంతాలలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు.

ఈ దాడుల్లో గుంతకల్లు మండలంలో 825 లీటర్లు, పామిడి మండలంలో 705 లీటర్లు, పెద్దవడుగూరు మండలంలో 1,200 లీటర్లు, గుత్తి మండలంలో 500 లీటర్లు మొత్తం సుమారు 3200 లీటర్ల నాటు సారా బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఎవరైనా నాటుసారా నిలువ ఉంచిన, తయారుచేసిన, విక్రయించిన, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గ్రామస్థులను పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చదవండి : నివర్ దెబ్బకు...పంటలకు తీవ్ర నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.